Episode · మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
Ep-12 బకాసుర సంహారం - ఏకచక్రపురంలో భీమ పరాక్రమం!
25 Mar 2026 · 9 min
Episode notes
బ్రాహ్మణ వేషధారణలో ఉన్న పాండవులకు ఏకచక్రపురంలో ఎదురైన పరీక్ష ఏమిటి? ఊరి జనాలను పీడిస్తున్న క్రూర రాక్షసుడు బకాసురుడిని భీముడు ఎలా అంతం చేశాడు? కుంతీ దేవి సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న ధర్మం ఏమిటి? వ్యాస మహర్షి చెప్పిన ద్రౌపది జనన రహస్యం ఏమిటి? ఈ ఉత్కంఠభరితమైన గాథను నేటి ఎపిసోడ్‌లో వినండి! #Mahabharata #Bhima #Bakasura #Kunti #Vedavyasa #TeluguPodcast #మహాభారతం #తెలుగుపోడ్‌కాస్ట్
Podcast
మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
mahabharatapodcast by Aruna Adapa · Devotional & Spiritual · Telugu
An epic retelling of the Mahabharata in Telugu – one story at a time. Each episode narrates a part of the great Indian epic, with values, drama, and timeless life lessons. Suitable for both kids and adults
More from మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo) All episodes →
-
18 Jun 2026 · 20 min
Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు!
మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన తర్వాత పాండవుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత హస్తినాపురంలో పుట్టిన అపశకునాలు చూసి భయపడిన ధృతరాష్ట్రుడు వరాలు ఇచ్చి పాండవులను విడిపించినా... శకుని వ్యూహం అంతటితో ఆగలేదు! "అనుద్యూతం" అంటే రెండోసారి జరిగిన జూదంలో శకుని వేసిన ఆ కొత్త ఉచ్చు ఏంటి? 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లుగా ధర్మరాజు మళ్లీ ఆ ఆటకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? రాజవస్త్రాలను వీడి, నార వస్త్రాలు కట్టి, కన్నీళ్లతో అడవి బాట పట్టిన ఆ ఐదుగురు వీరులు మరియు సామ్రాజ్ఞి ద్రౌపది అరణ్య ప్రస్థానం ఎలా మొదలైంది? కురుసభలో అవమానానికి ప్రతికారంగా భీమార్జునులు చేసిన ఆ భీకర శపథాలు…
-
11 Jun 2026 · 21 min
Ep-16 శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం
మహాభారతం ఎపిసోడ్ 16: శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం : మహాభారత చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం, కురువంశ వినాశనానికి అసలైన నాంది ఈ ఎపిసోడ్! శకుని ఆడిన మాయా పాచికల ఉచ్చులో ధర్మరాజు ఎలా చిక్కుకుపోయాడు? సామ్రాజ్యాన్ని, సంపదను, చివరకు కన్నతమ్ముళ్లను, తనను తాను ఎలా ఒడ్డుకుంటూ వెళ్లాడు? సకల ధర్మాలు తెలిసిన భీష్మ, ద్రోణ, విదురులు ఉన్న ఆ కురుసభలో... ఒక సామ్రాజ్ఞికి జరిగిన ఘోర పరాభవం ఏంటి? అధర్మం రాజ్యమేలుతూ, వీరులంతా మూగబోయిన ఆ సభలో ద్రౌపది చేసిన ఆక్రందన... ఆమె మానాన్ని కాపాడటానికి ఆ ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు చేసిన అక్షయ వస్త్ర లీల... వినే ప్రతి ఒక్కరి గుండెలను పిండేసే ఈ హృదయవిదారక ఘట్టాన్ని ఈ…
-
26 Apr 2026 · 14 min
Ep- 15: "రాజసూయ యాగం - కృష్ణుడి విశ్వరూపం"
జరాసంధుడు ఎలా పుట్టాడు? 14 రోజులు భీముడిని ఓడించిన అతడిని చివరకు ఎలా చంపారు? కృష్ణుడు ఒక గడ్డి పరక ఎందుకు విసిరాడు? రాజసూయ యాగంలో శిశుపాలుడు 100 నిందలు ఎందుకు తిట్టాడు? కృష్ణుడు ఎందుకు 99 నిందలు భరించి 100వ నిందకే సుదర్శన చక్రం విసిరాడు? మహాభారతంలో అత్యంత పవర్‌ఫుల్ అయిన ఈ రెండు ఘట్టాలను ఈరోజు వినండి!
-
12 Apr 2026 · 19 min
Ep-14 ఇంద్రప్రస్థం - ఎడారిని స్వర్గంగా మార్చిన పాండవులు! | మయసభలో దుర్యోధనుడి అవమానం
పాండవులకు రాజ్యంలో సగం ఇస్తామని చెప్పి, ధృతరాష్ట్రుడు వారికి ఇచ్చింది ఏమిటి? ఒక భయంకరమైన ఎడారి! కానీ, ఆ అడవిని ప్రపంచం ఆశ్చర్యపోయే **'ఇంద్రప్రస్థం'**గా పాండవులు ఎలా మార్చారు? ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే ఆసక్తికరమైన అంశాలు: ఖాండవ దహనం: అర్జునుడు తన సొంత తండ్రి, దేవేంద్రుడినే ఎదిరించి యుద్ధం చేసిన ఘట్టం. గాండీవ ప్రాప్తి: అగ్నిదేవుడు అర్జునుడికి అజేయమైన 'గాండీవం' ఎందుకు ఇచ్చాడు? మయసభ: రాక్షస శిల్పి మయుడు నిర్మించిన మాయా లోకం.. అక్కడ నేల ఏది? నీరు ఏది? ఒక్క నవ్వు - ఒక యుద్ధం: మయసభలో దుర్యోధనుడు పొందిన పరాభవం ఏమిటి? ద్రౌపది నవ్విన ఆ నవ్వు మహాభారత యుద్ధానికి ఎలా బీజం వేసింది? అసూయ, పగ, మరియు పట్టుదల…
-
31 Mar 2026 · 12 min
Ep-13 ద్రౌపదీ స్వయంవరం
అగ్నిపుత్రి ద్రౌపది స్వయంవర వేదికపై జరిగిన సంచలనం ఏమిటి? అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టిన తర్వాత రాజసభ ఎందుకు రణరంగంగా మారింది? కుంతీ దేవి తెలియక అన్న ఆ ఒక్క మాట పాండవుల మరియు ద్రౌపది జీవితాలను ఎలా మార్చేసింది? ఇది విధి లిఖితమా లేక పొరపాటా? ఈ విశేషాలన్నీ నేటి ఎపిసోడ్ 'మత్స్యయంత్ర భేదనం'లో మీకోసం!
-
15 Mar 2026 · 8 min
Ep-11 అరణ్య పర్వం: భీమ పరాక్రమం - హిడింబి అనురాగం మరియు ఘటోత్కచుడి జననం!
మంటల నుండి తప్పించుకున్నారు.. కానీ మృత్యువు వెంబడిస్తూనే ఉంది!. రాజ సౌధాల్లో పెరిగిన వారు దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య ఎలా బతికారు? 🔥 ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే విశేషాలు: ఒక్కడే సైన్యం: తన తల్లిని, నలుగురు సోదరులను భుజాలపై మోస్తూ భీముడు అడవిని ఎలా చీల్చుకుంటూ వెళ్ళాడు? హిడింబాసురుడి ఆకలి: మానవ మాంసం కోసం వచ్చిన రాక్షసుడిని భీముడు ఎలా మట్టికరిపించాడు? మాయావి హిడింబి: రాక్షస రూపం వదిలి సుందరాంగిగా మారిన హిడింబి.. భీముడిని చూసి ఎందుకు మనసు పారేసుకుంది? ఘటోత్కచుడి జననం: పుట్టిన క్షణమే యువకుడిగా పెరిగిన పాండవుల తొలి సంతానం ఘటోత్కచుడి అద్భుత శక్తులు ఏమిటి? నిబంధనలతో కూడిన వివాహం: ధర్మరాజు…
-
27 Jan 2026 · 13 min
Ep-10 లక్షాగృహ దహనం: కుట్రల మంటల్లో పాండవులు - బ్రహ్మాస్త్ర రహస్యం
ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే ప్రధాన అంశాలు: బ్రహ్మశిరోస్త్రం: ద్రోణాచార్యుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు ఈ దివ్యాస్త్రాన్ని ఉపదేశించాడు? దాని శక్తి మరియు నిబంధనలు ఏమిటి? కణిక నీతి: ధృతరాష్ట్రుడి మనసును మార్చిన కణికుడి విషపూరితమైన రాజకీయం ఏమిటి? మరణ యంత్రం - లక్షాగృహం: వారణావతంలో పురోచనుడు నిర్మించిన లక్క ఇంటి వెనుక ఉన్న భయంకరమైన ఇంజనీరింగ్ రహస్యాలు. విదురుడి గూఢ భాష: విదురుడు 'మ్లేచ్ఛ' భాషలో ధర్మరాజుకు పంపిన రహస్య సందేశం ఏమిటి? అది పాండవులను ఎలా కాపాడింది? ఆ రాత్రి.. అగ్ని ప్రళయం: లక్క ఇల్లు తగలబడుతున్నప్పుడు భీముడు తన కుటుంబాన్ని మృత్యువు నోటి నుండి ఎలా బయట పడేశాడు? అజ్ఞాతవాసానికి నాంది: లోకం…
-
23 Nov 2025 · 7 min
Ep-9 ద్రోణుడు-ద్రుపదుడి కథ
'మహాభారత గాథ' లోని ఈ అత్యంత నాటకీయమైన భాగంలో, రాజదర్పాన్ని, అహంకారాన్ని మరియు ప్రతీకారాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ద్రోణాచార్యుడు మరియు పాంచాల రాజు ద్రుపదుడు ఎలా శత్రువులుగా మారారు? ఒక పేదరికం, ఒక అహంకారపూరితమైన మాట... ద్రోణుడి మనసులో విషపు శల్యమై ఎలా మారింది? ⚔️ ఈ ఎపిసోడ్‌లో లోతుగా విశ్లేషించబడిన అంశాలు: స్నేహం నుండి శత్రుత్వం వరకు: ద్రుపదుడు తన బాల్య స్నేహితుడైన ద్రోణుడిని రాజసభలో అవమానించడానికి గల అసలు కారణాలు. అశ్వత్థామ పాల కథ: తన కుమారుడి దారిద్రాన్ని చూసి ద్రోణుడు పడిన ఆవేదన మరియు ప్రతీకార శపథం. గురువు ఆజ్ఞ: ద్రోణుడు తన శిష్యులైన కౌరవ పాండవుల ద్వారా గురుదక్షిణగా…
-
15 Nov 2025 · 5 min
Ep-8 దానవీరశూరకర్ణ
మహాభారత గాథ' లోని ఈ ప్రత్యేక భాగంలో, నిస్సహాయత, దానగుణం మరియు పరాక్రమానికి ప్రతీక అయిన దానవీర శూర కర్ణుడి జీవితంలోని అద్భుతమైన మరియు విషాదకరమైన మలుపులను తెలుసుకుందాం.!
-
3 Aug 2025 · 10 min
EP-7 గురు ద్రోణాచార్యుల విద్యాబోధన - విలువిద్యలో అర్జునుడి ప్రావీణ్యం మరియు ఏకలవ్యుడు
ఈ ఎపిసోడ్‌లో మీరు తెలుసుకోబోతున్న కథలు రెండు! 🟠 ఏకలవ్యుడు – గురువు లేకుండానే ధనుర్విద్యలో నిపుణుడై, అర్జునుని కూడా ఆశ్చర్యపరిచిన అరణ్య వీరుడు. 🟠 కర్ణుడు – తన జన్మరహస్యంతో కూడిన శక్తిమంతుడు, అర్జునుని సమానంగా ధైర్యంగా నిలిచిన సూర్యపుత్రుడు. ఈ ఇద్దరూ అర్జునుని జీవితంలో ముఖ్యమైన సవాళ్లుగా మారారు. ఈ కథలు మనకు నిబద్ధత, గురుభక్తి, ధైర్యం, మరియు స్వభిమానం గురించిన విలువలను నేర్పిస్తాయి.
