Episode notes
సంగీతమే తన జీవితంగా మారింది... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది! చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో.. కర్ణాటక సంగీతం నేర్చుకుని, 24 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఎన్నో ఆల్బమ్స్, సినిమాలు, సీరియల్స్‌కు సంగీతం అందించి.. నంది అవార్డును కూడా అందుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురై.. కొంతకాలం సంగీతానికి దూరమయ్యారు. అలాంటి సమయంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తుల సహకారంతో.. మళ్లీ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. మరి అనిల్ కుమార్ గారి సంగీత ప్రయాణం ఎలా మొదలైంది? ఆయన జీవితంలో ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి తన…
TALRadio Telugu
by Touch A Life Foundation · Telugu · Stories
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
More from TALRadio Telugu
-
S1 · E12 · 8 Oct 2026 · 13 minNew
మధ్యతరగతి వాళ్లు రిచ్ అవ్వడానికి సింపుల్ టిప్స్ ! | Smart Money Mindset - 12
జీతం ఎంతైనా సరే.. సంపద పెంచుకోవడానికి ఈ 5 విషయాలు ముఖ్యం! చాలామంది రోజుకు 10–12 గంటలు పనిచేస్తారు.. సంపాదిస్తారు.. కొంత దాచుకుంటారు. కానీ మన సమయం, నైపుణ్యాలు, డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తున్నామా? లేదా? అనేదే అసలు ప్రశ్న. అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Naval Ravikant ఆలోచనల ఆధారంగా సంపదను నిర్మించుకోవడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన విషయాల గురించి మనతో పంచుకున్నారు.. Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు! సరైన నిర్ణయాలు తీసుకోవడం.. లాంగ్‌టర్మ్‌గా ఆలోచించడం.. Leverageను ఉపయోగించుకోవడం.. మనకున్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించడం.. ముఖ్యంగా Compoundingకు…
-
8 Oct 2026 · 47 minNew
రేడియో వెనుక ఆసక్తికరమైన ప్రపంచం! | Special Interview With Hari Madugula
రేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం! మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న రేడియో రిసీవర్‌తో ప్రపంచంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను వినడం వెనుక ఉన్న ఆసక్తి, ఉత్సాహం నిజంగా ప్రత్యేకమైనది! Shortwave Listening, DXing, Amateur Radio, SDR, Digital Radio… ఇలా రేడియో ప్రపంచంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మొబైల్, ఇంటర్నెట్ యుగంలోనూ రేడియోను ఒక హాబీగా కొనసాగిస్తున్న ఎంతోమంది రేడియో ప్రేమికులు ఇప్పటికీ ఉన్నారు! దశాబ్దాలుగా రేడియో అభిరుచిని కొనసాగిస్తూ… రేడియో…
-
S1 · E83 · 5 Oct 2026 · 35 min
విశాఖపట్టణం లో మా స్కూల్ చాలా బావుంటుంది ! | మా ఊరు - 83
మనం ఎక్కడికి వెళ్లినా… చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు మనతోనే ప్రయాణిస్తాయి! అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో ప్రీతి మునగపాటి గారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. భీమవరంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన ప్రీతి గారు.. ప్రకృతి అందాల మధ్య ఉన్న విశాఖవల్లి స్కూల్‌లో చదువుకున్న రోజుల గురించి, చిన్నప్పటి స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావరణం, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తన వ్యక్తిత్వంపై చూపిన ప్రభావం.. ఇలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీతి గారు.. IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో తన కెరీర్‌ను కొనసాగిస్తూ,…
-
5 Oct 2026 · 38 min
చిన్న పిల్లల బోన్ హెల్త్ - తప్పక తెలుసుకోవలిసిన విషయాలు ! | Health Talk
పిల్లల ఎముకల విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం! పిల్లల ఎముకలు పెద్దవాళ్ల ఎముకలకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. అవి ఎదుగుదల దశలో ఉండటంతో గాయాలను తట్టుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆడుకునే సమయంలో పడిపోవడం, చేతులకు గాయాలు అవ్వడం, ఫ్రాక్చర్ లాంటి సందర్భాల్లో కనిపించే కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు గమనించడం అవసరం. ముఖ్యంగా పిల్లలను చేతి మణికట్టు దగ్గర పట్టుకుని లాగడం వల్ల వచ్చే సమస్యలు, పిల్లలకు గాయాలు అయినప్పుడు ఇంట్లో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల ఎదుగుదలలో పోషకాహారం, Vitamin D ప్రాముఖ్యత వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు.. ఈ వారం హెల్త్ టాక్ పాడ్కాస్ట్ లో మనతో…
-
S1 · E11 · 1 Oct 2026 · 12 min
24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11
జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది! అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి చూడండి.. ఆ చిన్న ప్రయత్నమే మీలోని మార్పుకు ప్రారంభం కావచ్చు.. అంటున్నారు. మరి ఈ 24 గంటల్లో ఏం చేయాలి? మీ Identityని ఎలా మార్చుకోవాలి? పాత అలవాట్లను ఎలా దాటుకొని ముందుకు వెళ్ళాలి? తెలుసుకోవడానికి ఈ…
-
S2 · E4 · 1 Oct 2026 · 37 min
అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4
10 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు.. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 7 పుస్తకాలు రాశారు! చిన్నప్పుడు ఇంట్లో సాహిత్య వాతావరణంలో పెరిగిన ఇంద్రాణి పాలపర్తి గారు.. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, అమెరికా జీవితం.. ఇలా ఎన్ని బాధ్యతలు తనపై పడ్డా తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటివరకు 7 పుస్తకాలు రచించారు. ‘వానకు తడిసిన పువ్వు’ తో ప్రారంభమైన ఆమె సాహిత్య ప్రయాణంలో.. ప్రకృతి, మనిషి అనుభూతులు, తన చుట్టూ కనిపించే జీవితాన్ని కవిత్వంగా మలుస్తూ ముందుకు సాగుతున్నారు. చిన్నప్పుడు రాసిన తొలి కవిత నుంచి.. అమెరికా…
-
1 Oct 2026 · 32 min
చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు
హాస్పిటల్ అంటే.. ఇంజక్షన్స్, మందులు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తాయి…! కానీ.. చుట్టూ రంగు రంగుల గోడలు, ప్రకృతి దృశ్యాలు, అందమైన బొమ్మలు.. ఉంటే? ముఖ్యంగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు ఇలాంటి వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. Art2Hearts Foundation చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. పిల్లల కోసం పనిచేసే ఆసుపత్రులతో కలిసి.. వారి అవసరాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆర్ట్‌వర్క్స్‌ను సేకరించి, Pediatric Wardsలో ఏర్పాటు చేస్తోంది. ఎంతో మంది ఆర్టిస్టులు donate చేసిన వారి ఆర్ట్ ఫామ్స్ ను.. ఇంటి గోడలకే పరిమితం చేయకుండా, ఆసుపత్రిలో ఉన్న చిన్నారులకు ఒక సరికొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తున్నాయి.…
-
S1 · E7 · 29 Sep 2026 · 51 min
గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం! విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు. కానీ, ఇంకా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా చూశారు. దీంతో.. అక్కడే నిరంతరం పనిచేయాలని నిర్ణయించుకుని, 2021లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి Samaritans for the Nation అనే…
-
S1 · E10 · 24 Sep 2026 · 13 min
అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10
లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి! మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు.. లోన్ భారం నుంచి బయటపడేందుకు ఉపయోగపడే ఎన్నో practical tipsను…
-
S1 · E6 · 22 Sep 2026 · 40 min
మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6
‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…! తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపైనా ఆ ప్రభావం పడింది. అమ్మను చూసి.. తానూ సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా Muscular Dystrophyతో జీవిస్తున్నవారికి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంతో…
