Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Season 1, Episode 6 · TALRadio Telugu

మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6

22 Sep 2026 · 39 min

Play episode WhatsApp Download

Episode notes

‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…! తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపైనా ఆ ప్రభావం పడింది. అమ్మను చూసి.. తానూ సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా Muscular Dystrophyతో జీవిస్తున్నవారికి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంతో…

Podcast

TALRadio Telugu

Touch A Life Foundation · Stories · Telugu

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

More from TALRadio Telugu All episodes →

  1. S1 · E11 · 1 Oct 2026 · 12 min

    24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11

    జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది! అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి చూడండి.. ఆ చిన్న ప్రయత్నమే మీలోని మార్పుకు ప్రారంభం కావచ్చు.. అంటున్నారు. మరి ఈ 24 గంటల్లో ఏం చేయాలి? మీ Identityని ఎలా మార్చుకోవాలి? పాత అలవాట్లను ఎలా దాటుకొని ముందుకు వెళ్ళాలి? తెలుసుకోవడానికి ఈ…

  2. S2 · E4 · 1 Oct 2026 · 37 min

    అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4

    10 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు.. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 7 పుస్తకాలు రాశారు! చిన్నప్పుడు ఇంట్లో సాహిత్య వాతావరణంలో పెరిగిన ఇంద్రాణి పాలపర్తి గారు.. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, అమెరికా జీవితం.. ఇలా ఎన్ని బాధ్యతలు తనపై పడ్డా తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటివరకు 7 పుస్తకాలు రచించారు. ‘వానకు తడిసిన పువ్వు’ తో ప్రారంభమైన ఆమె సాహిత్య ప్రయాణంలో.. ప్రకృతి, మనిషి అనుభూతులు, తన చుట్టూ కనిపించే జీవితాన్ని కవిత్వంగా మలుస్తూ ముందుకు సాగుతున్నారు. చిన్నప్పుడు రాసిన తొలి కవిత నుంచి.. అమెరికా…

  3. 1 Oct 2026 · 32 min

    చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు

    హాస్పిటల్ అంటే.. ఇంజక్షన్స్, మందులు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తాయి…! కానీ.. చుట్టూ రంగు రంగుల గోడలు, ప్రకృతి దృశ్యాలు, అందమైన బొమ్మలు.. ఉంటే? ముఖ్యంగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు ఇలాంటి వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. Art2Hearts Foundation చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. పిల్లల కోసం పనిచేసే ఆసుపత్రులతో కలిసి.. వారి అవసరాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆర్ట్‌వర్క్స్‌ను సేకరించి, Pediatric Wardsలో ఏర్పాటు చేస్తోంది. ఎంతో మంది ఆర్టిస్టులు donate చేసిన వారి ఆర్ట్ ఫామ్స్ ను.. ఇంటి గోడలకే పరిమితం చేయకుండా, ఆసుపత్రిలో ఉన్న చిన్నారులకు ఒక సరికొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తున్నాయి.…

  4. S1 · E7 · 29 Sep 2026 · 51 min

    గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07

    గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం! విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు. కానీ, ఇంకా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా చూశారు. దీంతో.. అక్కడే నిరంతరం పనిచేయాలని నిర్ణయించుకుని, 2021లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి Samaritans for the Nation అనే…

  5. S1 · E10 · 24 Sep 2026 · 13 min

    అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10

    లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి! మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు.. లోన్ భారం నుంచి బయటపడేందుకు ఉపయోగపడే ఎన్నో practical tips‌ను…

  6. S1 · E82 · 21 Sep 2026 · 44 min

    సెలవులు రాగానే ఊరికి వెళ్ళడం చాలా బాగుండేది! | Mr. Shakeel Basha | మా ఊరు - 82

    ఎన్ని సంవత్సరాలు గడిచినా… మన ఊరికి వెళ్లినప్పుడు కలిగే ఆ ఆనందం మాత్రం అస్సలు మారదు! చిన్నప్పుడు నాన్నతో కలిసి ఊరికి వెళ్లిన రోజులు, బస్సులు మారుతూ ప్రయాణం చేసిన సందర్భాలు, కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన జ్ఞాపకాలు… ఇప్పటికీ మన మనసులో అలాగే ఉంటాయి అంటూ… తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. శకీల్ బాషా గారు! ఊరికి వెళ్లాలంటే అప్పట్లో బస్సులు మారి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చినా.. ఆ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారట. ఊరికి చేరుకున్నాక పెద్దవాళ్లు, అత్తలు, బంధువులను కలవడం, పొలాల్లోకి వెళ్లి పల్లీలు కాల్చుకుని తినడం, స్వచ్ఛమైన గాలి,…

  7. S1 · E9 · 17 Sep 2026 · 15 min

    మీరు కూడా ధనవంతులు కావచ్చు! | Smart Money Mindset Telugu - 9

    డబ్బు సంపాదించడానికి.. మనం ఎంత కష్టపడుతున్నామన్నది కాదు..మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే చాలా ముఖ్యం! మనలో చాలామందికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చాలా డబ్బు సంపాదించాలి, జీవితంలో ముందుకు వెళ్లాలి, మనకు నచ్చిన పనిని చేయాలి అని అనుకుంటుంటాం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ఆలోచనలు, మనపై మనకున్న నమ్మకం, మన నిర్ణయాలు, మనం చేసే పనులు ఎంత ముఖ్యమో చాలాసార్లు ఆలోచించం. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘Think and Grow Rich’ పుస్తకంలోని 13 Principles ద్వారా ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు వివరించారు. మనకు ఏం కావాలో…

  8. S2 · E13 · 17 Sep 2026 · 35 min

    బతుకు నేర్పిన పాఠాలు... కలం చెప్పిన కథలు! | అట్టెం దత్తయ్య | మన రచయితలు | Season - 2 | Episode - 13

    చేతిలో పుస్తకం ఉండాల్సిన వయసులో.. కర్ర పట్టుకుని మేకలను కాసేవారు! కానీ.. చదువుకోవాలనే పట్టుదల మాత్రం ఆయనను అక్కడే ఆగనివ్వలేదు! కామారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన డా. అట్టెం దత్తయ్య గారు చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు గొర్రెల కాపరిగా ఉంటూ.. అడవిలో గొర్రెలను కాస్తూనే పుస్తకాలు చదివారు. ఒక స్నేహితుడు వేసిన కొన్ని ప్రశ్నలు ఆయన జీవితాన్నే మార్చేశాయి. మళ్లీ చదువుకోవాలని నిర్ణయించుకుని.. పాత పుస్తకాలు తెచ్చుకుని చదువుకున్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఉపాధ్యాయుల సహాయం తీసుకున్నారు. పగలు పిల్లలకు పాఠాలు చెబుతూ.. రాత్రి కాలేజీలో…

  9. S1 · E1 · 17 Sep 2026 · 33 min

    యూత్ పవర్ తో సేవకు కొత్త దారి! | Youth For Seva | స్ఫూర్తి కిరణాలు

    కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తాం… ఉద్యోగం కోసం సమయాన్ని కేటాయిస్తాం… మరి సమాజం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? అని ఎప్పుడైనా ఆలోచించారా? రోజంతా పని, బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా.. మన దగ్గర ఉన్న సమయం, నైపుణ్యం, అనుభవంతో సమాజానికి ఏదో ఒకటి చేయవచ్చని నిరూపిస్తోంది… ‘Youth for Seva’! 2007లో ప్రారంభమైన Youth for Seva.. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లోని 46 నగరాల్లో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, జీవనోపాధి వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. Corporate Volunteering ద్వారా ఉద్యోగులు తమకు ఉన్న skills‌తో విద్యార్థులకు బోధించడం, స్కూల్స్‌లో కార్యక్రమాలు నిర్వహించడం, మొక్కలు నాటడం, వెల్‌నెస్ కిట్లు…

  10. S1 · E5 · 15 Sep 2026 · 26 min

    వృద్ధుల హక్కులకు తోడుగా.. | Ramachandraiah | అంతరంగాలు - 5

    ఒక మంచి ఆలోచన… ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదు! వృద్ధులకు అండగా నిలవాలి.. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.. సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి.. అని ఎప్పుడూ ఆలోచిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు… Telangana senior citizens confederation అధ్యక్షులు రామచంద్రయ్య గారు! సీనియర్ సిటిజన్ల కోసం ఆయన చేస్తున్న సేవలు ఎంతోమందికి అండగా నిలిచాయి. కరోనా సమయంలోనూ పేద కుటుంబాలకు సహాయం చేయడంతో పాటు.. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు. అలా సమాజానికి తన వంతు సహాయం చేయాలనే ఆలోచనతో ఆయన ప్రారంభించిన ‘జీవనాధార’ కార్యక్రమం.. పేదలకు ఉచిత మందులు, వైద్య సహాయం, విద్యకు…

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play