Season 1, Episode 82 · TALRadio Telugu
సెలవులు రాగానే ఊరికి వెళ్ళడం చాలా బాగుండేది! | Mr. Shakeel Basha | మా ఊరు - 82
21 Sep 2026 · 44 min
Season 1, Episode 82 · TALRadio Telugu
21 Sep 2026 · 44 min
ఎన్ని సంవత్సరాలు గడిచినా… మన ఊరికి వెళ్లినప్పుడు కలిగే ఆ ఆనందం మాత్రం అస్సలు మారదు! చిన్నప్పుడు నాన్నతో కలిసి ఊరికి వెళ్లిన రోజులు, బస్సులు మారుతూ ప్రయాణం చేసిన సందర్భాలు, కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన జ్ఞాపకాలు… ఇప్పటికీ మన మనసులో అలాగే ఉంటాయి అంటూ… తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. శకీల్ బాషా గారు! ఊరికి వెళ్లాలంటే అప్పట్లో బస్సులు మారి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చినా.. ఆ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారట. ఊరికి చేరుకున్నాక పెద్దవాళ్లు, అత్తలు, బంధువులను కలవడం, పొలాల్లోకి వెళ్లి పల్లీలు కాల్చుకుని తినడం, స్వచ్ఛమైన గాలి,…
by Touch A Life Foundation · Telugu · Stories
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
S1 · E7 · 29 Sep 2026 · 51 min
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం! విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు. కానీ, ఇంకా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా చూశారు. దీంతో.. అక్కడే నిరంతరం పనిచేయాలని నిర్ణయించుకుని, 2021లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి Samaritans for the Nation అనే…
S1 · E10 · 24 Sep 2026 · 13 min
లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి! మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు.. లోన్ భారం నుంచి బయటపడేందుకు ఉపయోగపడే ఎన్నో practical tipsను…
S1 · E6 · 22 Sep 2026 · 40 min
‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…! తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపైనా ఆ ప్రభావం పడింది. అమ్మను చూసి.. తానూ సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా Muscular Dystrophyతో జీవిస్తున్నవారికి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంతో…
S1 · E9 · 17 Sep 2026 · 15 min
డబ్బు సంపాదించడానికి.. మనం ఎంత కష్టపడుతున్నామన్నది కాదు..మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే చాలా ముఖ్యం! మనలో చాలామందికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చాలా డబ్బు సంపాదించాలి, జీవితంలో ముందుకు వెళ్లాలి, మనకు నచ్చిన పనిని చేయాలి అని అనుకుంటుంటాం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ఆలోచనలు, మనపై మనకున్న నమ్మకం, మన నిర్ణయాలు, మనం చేసే పనులు ఎంత ముఖ్యమో చాలాసార్లు ఆలోచించం. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘Think and Grow Rich’ పుస్తకంలోని 13 Principles ద్వారా ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు వివరించారు. మనకు ఏం కావాలో…
S2 · E13 · 17 Sep 2026 · 35 min
చేతిలో పుస్తకం ఉండాల్సిన వయసులో.. కర్ర పట్టుకుని మేకలను కాసేవారు! కానీ.. చదువుకోవాలనే పట్టుదల మాత్రం ఆయనను అక్కడే ఆగనివ్వలేదు! కామారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన డా. అట్టెం దత్తయ్య గారు చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు గొర్రెల కాపరిగా ఉంటూ.. అడవిలో గొర్రెలను కాస్తూనే పుస్తకాలు చదివారు. ఒక స్నేహితుడు వేసిన కొన్ని ప్రశ్నలు ఆయన జీవితాన్నే మార్చేశాయి. మళ్లీ చదువుకోవాలని నిర్ణయించుకుని.. పాత పుస్తకాలు తెచ్చుకుని చదువుకున్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఉపాధ్యాయుల సహాయం తీసుకున్నారు. పగలు పిల్లలకు పాఠాలు చెబుతూ.. రాత్రి కాలేజీలో…
S1 · E1 · 17 Sep 2026 · 33 min
కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తాం… ఉద్యోగం కోసం సమయాన్ని కేటాయిస్తాం… మరి సమాజం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? అని ఎప్పుడైనా ఆలోచించారా? రోజంతా పని, బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా.. మన దగ్గర ఉన్న సమయం, నైపుణ్యం, అనుభవంతో సమాజానికి ఏదో ఒకటి చేయవచ్చని నిరూపిస్తోంది… ‘Youth for Seva’! 2007లో ప్రారంభమైన Youth for Seva.. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లోని 46 నగరాల్లో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, జీవనోపాధి వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. Corporate Volunteering ద్వారా ఉద్యోగులు తమకు ఉన్న skillsతో విద్యార్థులకు బోధించడం, స్కూల్స్‌లో కార్యక్రమాలు నిర్వహించడం, మొక్కలు నాటడం, వెల్‌నెస్ కిట్లు…
S1 · E12 · 8 Oct 2026 · 13 min
జీతం ఎంతైనా సరే.. సంపద పెంచుకోవడానికి ఈ 5 విషయాలు ముఖ్యం! చాలామంది రోజుకు 10–12 గంటలు పనిచేస్తారు.. సంపాదిస్తారు.. కొంత దాచుకుంటారు. కానీ మన సమయం, నైపుణ్యాలు, డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తున్నామా? లేదా? అనేదే అసలు ప్రశ్న. అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Naval Ravikant ఆలోచనల ఆధారంగా సంపదను నిర్మించుకోవడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన విషయాల గురించి మనతో పంచుకున్నారు.. Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు! సరైన నిర్ణయాలు తీసుకోవడం.. లాంగ్‌టర్మ్‌గా ఆలోచించడం.. Leverageను ఉపయోగించుకోవడం.. మనకున్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించడం.. ముఖ్యంగా Compoundingకు…
8 Oct 2026 · 47 min
రేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం! మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న రేడియో రిసీవర్‌తో ప్రపంచంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను వినడం వెనుక ఉన్న ఆసక్తి, ఉత్సాహం నిజంగా ప్రత్యేకమైనది! Shortwave Listening, DXing, Amateur Radio, SDR, Digital Radio… ఇలా రేడియో ప్రపంచంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మొబైల్, ఇంటర్నెట్ యుగంలోనూ రేడియోను ఒక హాబీగా కొనసాగిస్తున్న ఎంతోమంది రేడియో ప్రేమికులు ఇప్పటికీ ఉన్నారు! దశాబ్దాలుగా రేడియో అభిరుచిని కొనసాగిస్తూ… రేడియో…
S1 · E8 · 6 Oct 2026 · 15 min
సంగీతమే తన జీవితంగా మారింది... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది! చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో.. కర్ణాటక సంగీతం నేర్చుకుని, 24 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఎన్నో ఆల్బమ్స్, సినిమాలు, సీరియల్స్‌కు సంగీతం అందించి.. నంది అవార్డును కూడా అందుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురై.. కొంతకాలం సంగీతానికి దూరమయ్యారు. అలాంటి సమయంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తుల సహకారంతో.. మళ్లీ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. మరి అనిల్ కుమార్ గారి సంగీత ప్రయాణం ఎలా మొదలైంది? ఆయన జీవితంలో ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి తన…
S1 · E83 · 5 Oct 2026 · 35 min
మనం ఎక్కడికి వెళ్లినా… చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు మనతోనే ప్రయాణిస్తాయి! అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో ప్రీతి మునగపాటి గారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు. భీమవరంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన ప్రీతి గారు.. ప్రకృతి అందాల మధ్య ఉన్న విశాఖవల్లి స్కూల్‌లో చదువుకున్న రోజుల గురించి, చిన్నప్పటి స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావరణం, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తన వ్యక్తిత్వంపై చూపిన ప్రభావం.. ఇలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీతి గారు.. IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో తన కెరీర్‌ను కొనసాగిస్తూ,…