Skip to content
Melo Podcasts Home
CategoriesLanguagesFollowing

Podcast · News

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

by Suno India · Telugu · News

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, [email protected] (mailto:[email protected]) కి email పెట్టండి. (Samacha

WhatsApp (opens WhatsApp)
New episodes
Monthly
Typical length
40 min
Latest
30 Oct 2022
Language
Telugu

Latest episode

30 Oct 2022 · 42 min

సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 2 (Caeseran delivery Vs Normal delivery part 2)

ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ? తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ? డెలివరీ సమయాల్లో డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు presures ఏమిటీ ? అనే అనేక విషయాల గురించి సునో ఇండియా వారి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ . స్నేహ గారి ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.

Earlier episodes 29 most recent

  1. 30 Oct 2022 · 40 min

    సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)

    దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్ దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే . గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది . ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ? ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ? ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ ఫీజు వస్తుందనే వాదన నిజమా ? నార్మల్ లేదా సిజేరియన్ ప్రసవాల్లో ఏది ? ఎప్పుడు ? ఎంతవరకు తల్లి బిడ్డకు…

  2. 26 Oct 2022 · 43 min

    తలసేమియా గురించి ఎందరికి తెలుసు? (How many people know about Thalassemia?)

    రక్తం అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న groups, classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు? ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, . తలసేమియా ఉన్న పిల్లవాడు అలసట, బలహీనత, నెమ్మదిగా పెరుగుదల, పేలవమైన ఆకలి మరియు రక్తహీనత వంటి లక్షణాలను చూపుతాడు. చికిత్స రక్త మార్పిడితో ఉంటుంది, దీని వల్ల కుటుంబంపై మానసిక మరియు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. తలసేమియా అంటే గ్రీక్ భాషలో…

  3. 21 Oct 2022 · 1 hr 2 min

    పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం (Child sexual abuse - What does POCSO act say)

    గత కొద్దికాలంగా దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు . ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ? పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం . abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ? నేరం జరిగినప్పుడు సోషల్ స్టిగ్మా అని భయపడకుండా ఎప్పుడు ఎవరికీ ఎలా రిపోర్ట్ చెయ్యాలి? పిల్లల ప్రవర్తనలో కనపడే…

  4. 29 Sep 2022 · 48 min

    ధాన్య సేకరణలో ప్రైవేట్ కి అవకాశం . ఎవరి మేలు కోసం ? (Private players in grains procurement)

    140 కోట్ల జనాభా అందులో దాదాపు 60% వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం 20. 19% . కరోనా పాండమిక్ లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుసు .రైతే రాజు .లక్షల్లో బ్యాంకు బాలన్స్ ఉండేలా వ్యవసాయ రంగాన్ని నిలుపుతామన్న హామీలు. రైతుల ఆశ లు ఆకాంక్షలకు షాక్ తగిలేలా వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పుల మూలంగా అగ్రికల్చర్ ,రైతుల కు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఎంత నిజం ? కారణం ఏంటి ? అగ్రికల్చర్ లో ఫైనల్ స్టేజి అయినా ధన్య సేకరణ ,మద్దతు ధర , సమయానికి పేమెంట్ ని ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ,…

  5. 17 Sep 2022 · 51 min

    తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 (Significance of Sept 17 for telangana)

    తెలంగాణ ప్రాంత చరిత్రలో సెప్టెంబర్ 17 కి ఒక గుర్తింపు ,ప్రాముఖ్యత ఉందని అందరికి తెలిసిందే . రైతులు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం అంటారు . కమ్యూనిస్టుల ప్రాబల్యం తో 1952 వరకు జరిగిన పోరాటం అంటారు . నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన ప్రజల పోరాటం అంటారు. దేశ స్వతంత్రం కోసం పోరాడినా నిజాం పాలన నుండి ఫ్రీడమ్ దొరకనందున జరిపిన పోరాటం అంటారు. దేశ సమైక్యత లో భాగం కావటానికి జరిపిన పోరాటం లేదా ఆక్షన్ డే అంటే జాతీయ. సమైక్యతా దినం అని ఒకరు తెలంగాణ విమోచన దినం అని అనేక విధాలుగా పిలుస్తూ 75 సంవత్సరాల తరువాత ఘనంగా ఉత్సవాలు నిర్వహణ ప్లాన్ చేసారు . వీరు వారు అని కాదు అన్ని రాజకీయ పార్టీలు సెంటర్ నుండి స్టేట్ వరకు…

  6. 31 Aug 2022 · 1 hr 1 min

    తల్లి పాల బ్యాంకు (Mothers milk bank)

    బిడ్డ ఆకలితో అల్లాడినా.. తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు. తల్లి పాలు అందని పిల్లల కోసం వేరే మహిళ Breast milk feed cheyyatam మనకు తెలుసు . శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే . పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల తల్లికి దూరంగా ఉంచే బిడ్డల ఆకలి తీర్చుతోంది ‘ధాత్రి’ మిల్క్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 మంది వరకూ…

About సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, [email protected] (mailto:[email protected]) కి email పెట్టండి. (Samacha

సమాచారం సమీక్ష - A Telugu News Podcast is a Telugu news podcast from Suno India. Melo plays each episode straight from the publisher's own feed — no ads added, no account needed — and remembers where you stopped, in this browser only.

Publisher
Suno India
Language
Telugu తెలుగు
Category
News
New episodes
Monthly
Typical length
40 min
Latest episode
30 Oct 2022
Feed
RSS — paste into any podcast app
Rights
2026 Suno India

More from Suno India

More Telugu news

Take it with you

The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.

Get it on Google Play